డబుల్ సెంచరీతో మ్యాక్స్‌వెల్ రికార్డుల వర్షం..

8th NOV 2023

Pic credit - Instagram

ప్రపంచకప్-2023లో 39వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తుఫాను బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ వరుస రికార్డులు సృష్టించాడు.

మ్యాక్స్‌వెల్ రికార్డుల సునామీ..

ఆఫ్ఘనిస్థాన్‌పై 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ ఎడిషన్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మారాడు.

128 బంతుల్లో 201 పరుగులు

గ్లెన్ మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో చోటు ఖాయమైంది.

సెమీఫైనల్‌లో స్థానం ఖాయం 

ఈ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అలా చేసిన మొదటి బ్యాట్స్‌మన్

మ్యాక్స్‌వెల్ పాటో కమిన్స్ తోకలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో చివరి మూడు వికెట్లకు అతిపెద్ద భాగస్వామ్యం.

రికార్డు భాగస్వామ్యం

 వన్డే క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను ఏప్రిల్ 2011లో బంగ్లాదేశ్‌పై అజేయంగా 185 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను వదిలిపెట్టాడు. 

వాట్సన్‌ను వెనక్కునెట్టేశాడు

ప్రపంచకప్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద విజయం. మాక్స్‌వెల్ కాలు నొప్పితోనూ ఈ ఇన్నింగ్స్‌ను ఆడాడు. క్రీజులో నిలబడి చాలా షాట్లు కొట్టాడు.

ఆస్ట్రేలియా విజయం..

లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఇప్పుడు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 11న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.  

ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్ ఎప్పుడు?