టెస్టులో విరాట్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా?

TV9 Telugu

26 August 2024

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరికొద్ది రోజుల్లో మరోసారి టెస్టు క్రికెట్‌కు తిరిగి రానున్నాడు. అతనిపై అభిమానులు భారీ అంచనాలను కలిగి ఉంటారు.

టెస్టుల్లోకి రీఎంట్రీ 

సెప్టెంబర్ 19 నుంచి భారత్ వర్సెస్ బంగ్లా మధ్య 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లీ తన పాత స్టైల్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు.

పాత స్టైల్ చూపిస్తాడా?

85 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీని.. 2016, 2018 మధ్య కాలంలో ఫామ్‌లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

85 ఏళ్ల రికార్డు బద్దలే

భవిష్యత్తులో ఏ బ్యాట్స్‌మెన్ అయినా బద్దలు కొట్టలేని రికార్డు ఇది. అందుకు అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. 

ఎవరూ బ్రేక్ చేయలేరు

వరుసగా నాలుగు టెస్టుల సిరీస్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన రికార్డు ఇదే. దీంతో బ్రాడ్ మన్ రికార్డును బ్రేక్ చేశాడన్నమాట.

వరుసగా 4 సిరీస్‌లలో డబుల్ సెంచరీలు

జులై 2016, ఫిబ్రవరి 2017 మధ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లపై వరుసగా 4 సిరీస్‌లలో కోహ్లీ 4 డబుల్ సెంచరీలు సాధించాడు.

డబుల్ సెంచరీలతో హల్చల్

దీనితో, జూన్ 1930, జనవరి 1932 మధ్య వరుసగా 3 సిరీస్‌లలో 6 డబుల్ సెంచరీలు సాధించిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ 85 ఏళ్ల రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు.

బ్రాడ్‌మాన్ చరిత్రకు బ్రేక్

విరాట్ కోహ్లీ టెస్టుల్లో భారత్ తరపున అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాపై 254 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

అత్యధిక డబుల్ సెంచరీలు