146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా కోహ్లీ.. సచిన్‌కు సాధ్యం కాలే..
29th December 2023
Pic credit - Instagram
146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ చేయని రికార్డును 2023లో విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు.
అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లో అలాంటి రికార్డును సృష్టించలేకపోయాడు.
విరాట్ కోహ్లీ 2023లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తన చివరి ఇన్నింగ్స్‌ను ఆడాడు.
ఈ ఇన్నింగ్స్‌లో, కోహ్లీ 76 పరుగులు చేశాడు. దీంతో 2023లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది మొత్తం 2048 పరుగులు చేశాడు.
దీంతో 7 క్యాలెండర్ సంవత్సరాల్లో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లీ 2012లో 2186 పరుగులు, 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735 పరుగులు చేశాడు.
అలాగే, 2019లో 2455 పరుగులు, 2023లోనూ 2048 పరుగులతో సత్తా చాటిన కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
భారత దిగ్గజం విరాట్ కోహ్లీ తొలిసారిగా 2012 సంవత్సరంలో 2000కు పైగా పరుగులు సాధించి, తనదైన ముద్ర వేశాడు.
ఆ తర్వాత 2016 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు కోహ్లీ 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు సృష్టించాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..