TV9 Telugu

18 March 2024

స్మృతి, కోహ్లీ మధ్య ఒకేఒక్క తేడా.. మిగతావన్నీ సేమ్ టూ సేమ్

స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ ఇద్దరూ అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో జెర్సీ నంబర్ 18ని ధరిస్తున్నారు.

స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకే ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోసం క్రికెట్ ఆడుతున్నారు.

అటు అంతర్జాతీయ, లీగ్ మ్యాచ్‌ల్లోనూ స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో 3వ స్థానంలో బరిలోకి దిగుతుంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ ఇద్దరూ అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నారు. మైదానంలో స్మృతి మంధాన, విరాట్ కోహ్లీల ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది.

విరాట్ కోహ్లీ భారత్ తరపున 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కెప్టెన్‌గానూ వ్యవహిరంచాడు.

భారత మహిళల జట్టు తరపున మంధాన ఇప్పటి వరకు 6 టెస్టులు, 82 వన్డేలు, 128 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మంధానా కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.

స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత్ తరపున 100కు పైగా టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఇంకా ఆడుతూనే ఉన్నారు.

అయితే, మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు తొలి WPLలో టైటిల్ గెలుచుకుంది. విరాట్ 2013-21 నుంచి IPLలో RCB కెప్టెన్‌గా ఉన్నా, ఒక్క ట్రోఫీ గెలవలేదు.