టీ20ల్లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఇద్దరు
13th January 2024
Pic credit - Freepik
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ లిస్టులో ఎంతోమంది ఉన్నారు.
షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను టీ20లో నిపుణులుగా పరిగణిస్తారు. భారత ఆటగాళ్లు కూడా తక్కువేమీ కాదు.
ఈ ఫార్మాట్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్స్ అద్భుత ఆటను కనబరుస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో దూసుకపోతున్నారు.
భారత జట్టులో రోహిత్ శర్మ గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో సొంతంగా ఎన్నో మ్యాచ్‌లు గెలిచాడు. ఈ ఫార్మాట్‌లో ఎన్నో సెంచరీలు కూడా చేశాడు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 149 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 పరుగులు చేశాడు.
రోహిత్ టీ20 కెరీర్‌లో 4 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో మొత్తం 12 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో నిపుణుడిగా భావిస్తారు. ప్రస్తుత క్రికెట్‌లో కోహ్లి 3 ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు.
కోహ్లి 115 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 52.73 సగటు,137.96 స్ట్రైక్ రేట్‌తో 4008 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో కోహ్లీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 15 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.