27 May 2024
TV9 Telugu
ఐపీఎల్ 2024 ముగిసింది. కేకేఆర్ 3వసారి ట్రోఫీ అందుకుంది. హైదరాబాద్ జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కలేదు. అయితే, ఈసారి చాలామంది బౌలర్లు మెరిశారు.
PBKS పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 14 ఇన్నింగ్స్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. 10.03 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ మీడియం-పేసర్ టి నటరాజన్ 8.83 బౌలింగ్ ఎకానమీతో 13 ఇన్నింగ్స్‌లలో తన అద్భుత బౌలింగ్‌తో 19 వికెట్లు పడగొట్టాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ రైజింగ్ స్టార్ హర్షిత్ రాణా 11 ఇన్నింగ్స్‌లలో 9.08 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు.
KKR ఆల్ రౌండర్, ఆండ్రీ రస్సెల్ 14 ఇన్నింగ్స్‌లలో 10.05 ఎకానమీతో 19 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు.
జస్ప్రీత్ బుమ్రా మళ్లీ లీడర్‌బోర్డ్‌లోకి ప్రవేశించాడు. అతను 13 ఇన్నింగ్స్‌లలో 20 మంది బ్యాటర్‌లను పెవిలియన్ చేర్చాడు. 6.48 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.
లెగ్‌స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి KKR తరపున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అతను 14 ఇన్నింగ్స్‌లలో 8.04 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు.
IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ పేసర్ 14 ఇన్నింగ్స్‌లలో 9.73 ఎకానమీతో 24 వికెట్లు తీసి ఈ సీజన్‌లో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.