ప్రపంచకప్‌లో అత్యధిక జట్లతో ఓడిపోయిన టీంలు ఇవే.. లిస్టులో భారత్ ప్లేస్ ఇదే..

16th OCT 2023

Pic credit - Instagram

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లండ్‌ తన పేరు మీద చాలా అవమానకరమైన రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో తొలి జట్టుగా నిలిచింది.

ఇంగ్లండ్‌ పేరిట చెత్త రికార్డు..

ప్రపంచకప్‌లో అత్యధికంగా ఓడిపోయిన రికార్డులో ఇంగ్లండ్ టీం అగ్రస్థానంలో చేరింది. 11 జట్లతో ఓడిపోయిన దేశంగా ఇంగ్లండ్ నిలిచింది.

ఇంగ్లండ్..

ఇంగ్లండ్ తర్వాత వెస్టిండీస్ జట్టు కూడా ఈ లిస్టులో చేరింది. మొత్తంగా 10 జట్ల చేతిలో ఓడిపోయి, రెండో స్థానంలో నిలిచింది.

వెస్ట్ ఇండీస్..

South Africa: ఇక దక్షిణాఫ్రికా జట్టు 9 జట్ల చేతిలో ఓడిపోయింది. ఈ చెత్త రికార్డులో మూడో స్థానంలో నిలిచింది.

దక్షిణాఫ్రికా..

Australia: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 8 జట్ల చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ చెత్త లిస్టులో మూడవ స్థానంలో చేరింది.

ఆస్ట్రేలియా..

ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు కూడా ఈ లిస్టులో చేరింది. మొత్తంగా 8 జట్ల చేతిలో ఓడిపోయి, సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచింది.

భారత్..

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్‌తో పాటు పాకిస్థాన్ కూడా సమంగా నిలిచింది. మొత్తం 8 జట్ల చేతిలో పరాజయం పాలైంది. సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచింది.

పాకిస్తాన్..

ప్రపంచకప్‌ చరిత్రలో శ్రీలంక కూడా 8 జట్ల చేతిలో ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్‌ టీంలతో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచింది.

శ్రీలంక..

ఇక ఈ చెత్త రికార్డులో చివరి స్థానంలో న్యూజిలాండ్ టీం నిలిచింది. ప్రపంచకప్‌లో 7 జట్లు న్యూజిలాండ్‌ను ఓడించాయి.

న్యూజిలాండ్..