IPLలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాళ్లు

14 April 2024

TV9 Telugu

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, ఆర్‌సీబీ తరపున ఆడిన ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు.

ఏబీ డివిలియర్స్- 25 అవార్డులు

కేకేఆర్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన క్రిస్ గేల్, పంజాబ్, ఆర్‌సీబీ తరపున ఐపీఎల్‌లో కూడా ఆడాడు.

క్రిస్ గేల్- 22 అవార్డులు

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ- 19 అవార్డులు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన డేవిడ్ వార్నర్ 181 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

డేవిడ్ వార్నర్- 18 అవార్డులు

చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు కూడా జాబితాలో ఉంది.

మహేంద్ర సింగ్ ధోనీ- 17 అవార్డులు

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ 17 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు.

విరాట్ కోహ్లీ- 17 అవార్డులు

ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మొదటి సీజన్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు.

షేన్ వాట్సన్- 16 అవార్డులు

యూసుఫ్ పఠాన్ కేవలం 174 మ్యాచ్‌ల్లో 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

యూసుఫ్ పఠాన్- 16 అవార్డులు