అత్యధిక వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడిన టాప్ 10 ప్లేయర్లు వీరే.. లిస్టులో భారత్ నుంచి ఒక్కరే..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 46 ప్రపంచకప్ మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 45 ప్రపంచకప్ మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.
శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే 40 మ్యాచ్‌లు ఆడి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
జయవర్ధనే తర్వాత అతని టీమ్ మేట్ ముత్తయ్య మురళీధరన్ (40) 4వ స్థానంలో ఉన్నాడు.
గ్లెన్ మెక్‌గ్రాత్ 39 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడి 5వ స్థానంలో ఉన్నాడు.
ఈ లిస్టులో శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య కూడా 38 వన్డేలతో ఆరో స్థానంలో నిలిచాడు.
పాక్ మాజీ ప్లేయర్ వసీమ్ అక్రమ్(38) ఏడో స్థానంలో నిలిచాడు.
కుమార సంగక్కర(37) ఈ లిస్టులో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్వెస్ కల్లిస్(36) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో అరవింద్ డిసిల్వా 35 మ్యాచ్‌లతో 10వ స్థానంలో ఉన్నాడు.