చివరి ప్రపంచకప్ ఆడనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..

1st Oct 2023

Pic credit - Instagram

అక్షర్ పటేల్ గాయపడడంతో, రవిచంద్రన్ అశ్విన్ ODI ప్రపంచ కప్-2023 కోసం భారత జట్టులో చేరాడు. 2015లో ప్రపంచకప్ ఆడిన అశ్విన్, 2023లో భాగమయ్యాడు. 2019 ప్రపంచకప్‌లో ఛాన్స్ దక్కలేదు.

అక్షర్ ప్లేస్‌లో అశ్విన్

అశ్విన్ పెద్ద ప్రకటన ఇచ్చాడు. ఇది తన చివరి ప్రపంచ కప్ కావొచ్చు. భారత్-ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌కు ముందు దినేష్ కార్తీక్‌తో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించాడు.

కీలక ప్రకటన

గత కొన్నేళ్లుగా తాను ఎన్నో ఆశ్చర్యాలను అందుకున్నానని, అందుకే ఎక్కువగా ఆలోచించడం లేదని, తన ఆటను ఆస్వాదించాలనుకుంటున్నానని అశ్విన్ తెలిపాడు. 

ఆస్వాదిస్తా

భారత్ తరపున ఆడిన తన చివరి టోర్నీ ఇదే కావచ్చని అశ్విన్ అన్నాడు. దీంతో ఆయన త్వరలో రిటైర్మెంట్ కూడా ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదే చివరి టోర్నీ..

ప్రపంచకప్‌లో తనను ఎంపిక చేసినందుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదని అశ్విన్ అన్నాడు.

రోహిత్‌కు కృతజ్ఞతలు

అశ్విన్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన భాగం. కానీ, అతను పరిమిత ఓవర్లలో జట్టులో స్థానం కోల్పోయాడు. 2021, 2022లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో అశ్విన్ భారత జట్టులో భాగంగా ఉన్నాడు.

భారత టెస్ట్ జట్టులో కీలకం

అశ్విన్ అవకాశం దొరికితే 100 శాతం అందించి భారత్‌కు టైటిల్‌ను అందజేయడానికి ప్రయత్నిస్తాడు. 2011 తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలవలేదు.

100 శాతం

కాగా, అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ మొదలుకానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నై నుంచి భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

అక్టోబర్ 5 నుంచి