ప్రపంచకప్ గెలిచినా భారత్‌కు అసలు ట్రోఫీ రాదు.. ఎందుకో తెలుసా?
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
ఫైనల్‌లో గెలిచిన జట్టు ప్రసిద్ధ ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటుంది. అయితే ఈ ట్రోఫీ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ODI ప్రపంచకప్ 1975లో ప్రారంభమైనప్పటికీ, అధికారిక ట్రోఫీ 1999లో సృష్టించారు.
అంటే 1975-1996 మధ్య జరిగిన 6 ప్రపంచ కప్‌లలో విభిన్న డిజైన్ల ట్రోఫీలు అందించారు.
ప్రపంచకప్ గెలిచినప్పుడు నిజమైన ట్రోఫీని అందజేస్తారు. ఆ తర్వాత అదే మోడల్‌లో గెలిచిన జట్టుకు ప్రతిరూప ట్రోఫీని అందజేస్తారు.
అసలు ట్రోఫీ UAEలోని ICC ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తుంది. ప్రతి ఏడాది ఇదే ట్రోపీని అందజేస్తారు. మరలా తిరిగి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేర్చుతారు.
ఈరోజు భారత్ ప్రపంచకప్ గెలిచినా అసలు ట్రోఫీనే ముందుగా ప్రదానం చేస్తారు. తదుపరి ప్రతిరూప ట్రోఫీ ఇస్తారు.
ప్రస్తుత క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని లండన్‌కు చెందిన గెరార్డ్ కంపెనీ రూపొందించింది.
ట్రోఫీపై ఉన్న బంగారు బంతి మైదానం, బంతికి మద్దతు ఇచ్చే మూడు స్టంప్‌లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌కు ప్రతీక.
ప్రపంచంలోని వివిధ క్రీడా ట్రోఫీల గురించి సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ jacksontrophies.com ప్రకారం, దీని ధర 30 వేల డాలర్లు, అంటే దాదాపు 25 లక్షల రూపాయలు.