టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ఇదే.. భయపెడుతూన్న ఆ మ్యాచ్..

TV9 Telugu

16 June 2024

ఫ్లోరిడాలో భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా రద్దు చేశారు. ICC T20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 దశలో జరగబోయే టీమ్ ఇండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ వెల్లడైంది. 

ఇప్పుడు టీమ్ ఇండియా అమెరికా నుంచి వెస్టిండీస్‌కు వెళ్లి సూపర్-8 దశలో భారత్ ఎవరితో, ఎప్పుడు పోటీపడుతుందో తెలుసుకుందాం..

ఇక టీమ్ ఇండియా సూపర్-8 స్టేజ్ గురించి మాట్లాడితే.. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లతో తలపడనుంది. జూన్ 20న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. 

ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. కాగా, జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో సూపర్-ఎయిట్‌లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 

ఈ మూడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. అలాగే, రెండు మ్యాచ్‌లు గెలిచినా, సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. 

ఇప్పుడు జరగబోయే మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో భారత్ గెలిస్తే, అది 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.

1. ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ జూన్ 20, బార్బడోస్ 2. భారత్ vs బంగ్లాదేశ్/నెదర్లాండ్స్   జూన్ 22, ఆంటిగ్వా

3. భారత్ vs ఆస్ట్రేలియా జూన్ 24, సెయింట్ లూసియా. దీంతో టీమిండియా సూపర్ 8 మ్యా్చ్‌లు పూర్తవుతాయి.