పాకిస్తాన్ ప్లాన్స్‌కు దెబ్బేసిన ఒకే ఒక్క మ్యాచ్.. టోర్నీ నుంచి ఔట్

Venkatachari

7 June 2024

ఐసీసీ టోర్నీల్లో పెద్ద జట్లను ఓడించడం ద్వారా చిన్న జట్లు చాలా సార్లు అలజడి సృష్టించాయి. జూన్ 6న టీ20 ప్రపంచకప్ 2024లో కూడా ఇదే దృశ్యం కనిపించింది. 

షాకిస్తోన్న చిన్న జట్లు

పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను అమెరికా మట్టికరిపించింది. 

పాక్ జట్టుకు తొలి దెబ్బ

పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్థాన్ తదుపరి మ్యాచ్ భారత్‌తో జరగనుంది. ఇందులో భారత జట్టుదే పైచేయి.  

సూపర్ 8 ఆశలు గల్లంతు?

అమెరికా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అమెరికా 4 పాయింట్లు, +0.626 నెట్ రన్‌రేట్‌తో మొదటి స్థానంలో ఉంది.

లమెరికాకు ఛాన్స్

మరోవైపు భారత జట్టు కూడా పాకిస్థాన్‌ను ఓడిస్తే.. భారత్‌కు కూడా 4 పాయింట్లు దక్కుతాయి. అదే సమయంలో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ఖాతా తెరుచుకోదు.

భారత్ మ్యాచ్ లపైనా

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మరో మ్యాచ్ గెలిస్తే 6 పాయింట్లు వస్తాయి. భారత జట్టు తన మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే 8 పాయింట్లతో సూపర్-8కి చేరుకుంటుంది.

కష్టంగానే 

 ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ గెలిచినా.. కేవలం 4 పాయింట్లకే చేరుకోగా, అమెరికా 6 పాయింట్లతో సూపర్-8కి చేరుకుంటుంది. 

పాక్ ఛాన్స్ రావాలంటే

ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ తన మిగిలిన అన్ని మ్యాచ్‌లను ఎలాగైనా గెలవవలసి ఉంటుంది. ఇది కాకుండా, ఐర్లాండ్, భారతదేశం వంటి జట్లతో USA జట్టు ఓడిపోవాలని కూడా పాక్ ప్రార్థించవలసి ఉంటుంది.

వాళ్లు ఓడాలని