సూపర్ ఓవర్‌లో హీరోగా మారిన డేవిడ్ వీసా ఎవరు?

Venkatachari

3 June 2024

Who is David Wiese: బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్‌లో ఒమన్‌ను ఓడించింది. 

సూపర్ ఓవర్ లొ విక్టరీ

నమీబియా తరపున ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆల్ రౌండర్ డేవిడ్ వీసా హీరోగా నిలిచాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ తన సత్తా చాటాడు. 

ఆల్ రౌండర్ డేవిడ్ వీసా

మొత్తం మ్యాచ్‌లో 2 వికెట్లు, సూపర్ ఓవర్‌లో 14 పరుగులు చేయడం ద్వారా అతను తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

కీలక పాత్ర

తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటయింది. ఒమన్ అద్భుతమైన బౌలింగ్ ముందు నమీబియా 109 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ టై అయింది. 

మ్యాచ్ టై 

అనంతరం సూపర్ ఓవర్‌లో నమీబియా 21 పరుగులు చేయగా, ఒమన్ జట్టు 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వీసా తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు

 సూపర్ ఓవర్‌లో

సూపర్ ఓవర్‌లో నమీబియా తరపున డేవిడ్ వీసా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మొత్తం 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత తన సూపర్ ఓవర్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అద్భుతంగా బ్యాటింగ్

 1985 మే 18న దక్షిణాఫ్రికాలోని రూడ్‌పోర్ట్‌లో జన్మించిన వీసా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఫాస్ట్ బౌలర్. దక్షిణాఫ్రికా, నమీబియా రెండింటికీ ఆడాడు.

నమీబియా క్రికెటర్

డేవిడ్ వీసా 2013లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన T20I అరంగేట్రం చేశాడు. కానీ, వెంటనే జాతీయ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత నమీబియా తరపున ఆడుతున్నాడు.

దక్షిణాఫ్రికా తరపున