CWC 2023: పవర్‌ప్లేలో శ్రీలంక పరమ చెత్త రికార్డ్..

3rd Nov 2023

Pic credit - Instagram

ప్రపంచ కప్ (ICC world cup 2023) 33వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంకమధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది.

50 ఓవర్లలో 357 పరుగులు

టీమిండియా ఇచ్చిన భారీ స్కోరును ఛేదించలేకపోయిన  శ్రీలంక జట్టు.. మరోసారి ఆసియాకప్ ఫైనల్లో ఎదురైన పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఘోర ఓటమి ఎదురైంది.

ఆసియాకప్ ఫైనల్లో పరిస్థితే..

శ్రీలంక జట్టు మొత్తం కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

55 పరుగులకే

ఈ మ్యాచ్‌లో, శ్రీలంక బ్యాటింగ్ ఆరంభం నుంచి పేలవంగా తయారైంది. లంక తొలి నలుగురు బ్యాట్స్‌మెన్స్ కేవలం 3 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.

ఆరంభం నుంచి పేలవంగా

ఈ మ్యాచ్‌లో శ్రీలంక పవర్ ప్లే చాలా పేలవంగా సాగి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో ఇప్పటివరకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది. 

చెత్త ప్రదర్శన

భారత్‌పై శ్రీలంక జట్టు పవర్‌ప్లేలో 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో 6 వికెట్లు కూడా కోల్పోయింది. 

పవర్‌ప్లేలో 14 పరుగులు మాత్రమే

ప్రపంచకప్ పవర్‌ప్లేలో ఇప్పటివరకు ఇదే చెత్త ప్రదర్శనగా నిలిచింది. అంటే మొత్తంగా లంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది.

6 వికెట్లు కోల్పోయి 14 పరుగులు

అంతకుముందు కెనడా చెత్త ప్రదర్శన కనబరిచిన జట్టుగా నిలిచింది. 2011 ప్రపంచ కప్‌లో మొదటి పవర్‌ప్లే మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు కెనడా

ఈ విషయంలో శ్రీలంక కెనడాను వెనకేసుకొచ్చింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ చరిత్రలో పవర్‌ప్లేలో శ్రీలంక చెత్త బ్యాటింగ్ జట్టుగా అవతరించింది.

కెనడాను బీట్ చేసిన లంక