భారత దిగ్గజాలకు పీడకలగా మారిన దునిత్ వెల్లలాగే..

12 Sep 2023

Pic credit - Instagram

ఆసియా కప్ 2023లో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఏళ్ల యువ స్పిన్నర్ దునిత్ వెల్లల్లాగే అందరి దృష్టిని ఆకర్షించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను ఔట్ చేసి ట్రెండింగ్‌లా మారాడు.

తన సుదీర్ఘ కెరీర్‌లో శ్రీలంక మాజీ స్పిన్నర్ మురళీధరన్ కూడా చేయలేని పనిని ఈ యువ బౌలర్ చేశాడు. దునిత్ భారత్‌పై 5 వికెట్లు పడగొట్టి 20 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక స్పిన్నర్‌గా నిలిచాడు.

టీమిండియాలోని ఐదుగురు ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసిన తొలి శ్రీలంక స్పిన్నర్‌గా నిలిచి, టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 12వ ఓవర్‌లో దునిత్ విధ్వంసం మొదలైంది. రోహిత్, గిల్ 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో కీలక భాగస్వామ్యానికి బాటలు వేసేలా కనిపించారు.

ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతికే శుభ్‌మన్ గిల్ (19 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌ వికెట్లు పడగొట్టాడు.

దునిత్ వెల్లలాగే కొలంబోలో జన్మించాడు. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా పేరుగాంచాడు. 2022 అండర్-19 ప్రపంచకప్‌లో దునిత్ తొలిసారి క్రికెట్ ప్రపంచంలో వెలుగులోకి వచ్చాడు. 

6 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 17 వికెట్లు పడగొట్టాడు. అతను దక్షిణాఫ్రికాపై 130 బంతుల్లో 113 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌ను కూడా ఆడాడు. అందుకే 2022 జూన్‌లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. 

ఇప్పటి వరకు ఈ 20 ఏళ్ల యంగ్ బౌలర్ లంక తరపున 12 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు భారత్‌పై అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టి, వార్తల్లో నిలిచాడు.