జట్టుతోపాటు రోహిత్‌ను దూరం పెట్టాడు.. ఏకంగా స్వదేశానికి తిరిగొచ్చాడు

TV9 Telugu

15 June 2024

టీమిండియా ప్రస్తుతం వరుసగా 3 విజయాలతో సూపర్ 8 దశకు చేరుకుంది. అయితే, గ్రూప్ దశలో చివరి మ్యాచ్ నేడు ఆడాల్సి ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి సూపర్ 8కి చేరిన టీమిండియాలో పెద్ద దుమారమే రేగింది.

మీడియా కథనాల ప్రకారం, టీమిండియా రిజర్వ్ ప్లేయర్ల జాబితా నుంచి శుభమాన్ గిల్ కూడా తొలగించిన సంతగి తెలిసిందే.

నివేదికలను విశ్వసిస్తే, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు శుభ్‌మన్ గిల్‌ శిక్షకు గురయ్యాడు. అయితే, ఈ వార్తలపై ఇంకా ఎలాంటి నిర్ధారణ రాలేదు.

శుభ్‌మాన్ ఎక్కువ సమయం టీమిండియాకు దూరంగా గడిపాడని చెబుతున్నారు. అతను తన సైడ్ బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు.

శుభ్‌మన్ గిల్ టీమిండియాతో కలిసి ప్రయాణించడం కూడా కనిపించలేదు. ఇప్పుడు గ్రూప్‌ స్టేజ్‌ ముగిసిన తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మను కూడా శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడని అంటున్నారు.

శుభ్‌మన్ ప్రాణ స్నేహితుడు ఇషాన్ కిషన్‌పై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. అతను కూడా టీమిండియాకు దూరంగా ఉన్నాడు.