15 Sep 2023
Pic credit - Instagram
ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాపై రికార్డులు నెలకొల్పాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుత సెంచరీ చేసి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ తన సెంచరీని 117 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది ఆసియా కప్‌లో అతని మొదటి సెంచరీ. అతని ODI కెరీర్‌లో 5వ సెంచరీ.
దీనితో పాటు అతను ఈ సంవత్సరం ODIలలో తన 1000 పరుగులను కూడా పూర్తి చేశాడు. 2023లో ODIలలో అలా చేసిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడితే.. ఈ ఏడాది 1500 పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
శుభ్‌మన్ గిల్ 2023 సంవత్సరంలో ODIలలో 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 69గా నిలిచింది.
కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 259 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(w), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.