ఐపీఎల్ 2024లో కనిపించని సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకో తెలుసా?

TV9 Telugu

19 February  2024

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ సంచలనం సృష్టించాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ జట్టును భయపెట్టాడు.

అరంగేట్రం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ యంగ్ ముంబై ప్లేయర్ పేరు వార్తల్లో నిలుస్తోంది.

ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో వేల పరుగులు చేసి వార్తల్లో నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియాలో అవకాశం కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

గతంలో ఐపీఎల్‌లో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో విధ్వంసం సృష్టించాడు. అయితే ఈసారి మాత్రం మరోలా ఉండబోతోంది. కారణం కూడా విచిత్రంగా అనిపిస్తోంది.

ఇన్ని పరుగులు చేసి, అరంగేట్రం చేసిన తర్వాత కూడా, మీరు IPL 2024లో సర్ఫరాజ్ ఖాన్‌ను చూడలేరు. కారణం, ఐపీఎల్ ఫ్రాంచైజీలదే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్‌ డిసెంబరులో జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోలేదు. ఏ జట్టు కూడా ఈ ఆటగాడిపై ఆసక్తి చూపలేదు.

సర్ఫరాజ్ ఖాన్ గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అయితే ఈసారి వేలానికి ముందే ఢిల్లీ అతన్ని విడుదల చేసింది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పటి వరకు సర్ఫరాజ్ కాంట్రాక్ట్ 20 లక్షలకు ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్‌గా మారడంతో అతని బేస్ ధర 50 లక్షలుగా మారింది.