వామ్మో.. సానియా ఇలా మారిపోయిందేటి సామీ.. చూస్తే షాకే..
TV9 Telugu
10 February 2024
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ భారత క్రీడాకారిణి వార్తల్లో నిలుస్తోంది. అభిమానులు ఆమెపై అడుగడుగునా ఓ కన్నేసి ఉంచుతున్నారు.
ప్రేమలో మోసపోయిన సానియా, ఆ తర్వాత 13 ఏళ్ల వివాహ బంధం కూడా తెగిపోయిందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
అయితే, ఈ క్రమంలో సానియా కుంగిపోలేదు. ఒంటరిగా గడపడం లేదు. నిరంతరం తన జీవితాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తుంది.
తన స్నేహితులతో కలిసి ఓ ప్రత్యేక పార్టీలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన సానియా మరోసారి అదే తరహాలో కనిపించింది.
వెటరన్ టెన్నిస్ స్టార్, ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సానియా ప్రత్యేక స్నేహితుడు రోహన్ బోపన్నకు ఇది వేడుక.
శుక్రవారం, ఫిబ్రవరి 9, ముంబైలో జరిగిన పార్టీకి సానియా మీర్జా రెడ్ డ్రెస్‌లో వచ్చారు. ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడం కనిపించింది.
సానియా, షోయబ్ మాలిక్ కొన్ని నెలల క్రితం విడిపోయారు. అయితే ఇది జనవరి 2024లో సనా జావేద్‌తో తన మూడవ వివాహాన్ని మాలిక్ ప్రకటించినప్పుడు వెలుగులోకి వచ్చింది.