30th Sep 2023
Pic credit - Instagram
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. 25 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
టీమిండియా దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 1998లో మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడి 1894 పరుగులు పూర్తి చేశాడు.
టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ 1999లో 41 మ్యాచులు ఆడి 1767 పరుగులు సాధించాడు.
టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 1999లో 43 మ్యాచ్‌లు ఆడి 1761 పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్ 1996లో మరోసారి ఈ లిస్టులో చేరాడు. ఆ ఏడాది 32 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 1611 పరుగులతో నిలిచాడు.
ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ మాథ్యూ హేడెన్ 2007లో 32 మ్యాచ్‌లు ఆడి మొత్తం 1601 పరుగులు చేసి, ఐదవ స్థానంలో నిలిచాడు.
పాకిస్తాన్ ప్లేయర్ సయీద్ అన్వర్ 1996లో 36 మ్యాచ్‌లు ఆడి 1595 పరుగులు సాధించాడు. ఈ లిస్టులో 6వ స్థానంలో నిలిచాడు.
సౌరవ్ గంగూలీ 2000 సంవత్సరంలో మరోసారి ఈ లిస్టులో చేర్చాడు. 32 మ్యాచులు ఆడిన గంగూలీ 1579 పరుగులతో 7వ స్థానంలో నిలిచాడు.
ఇక ప్రస్తుతం టీమిండియా సారథి రోహిత్ శర్మ 8వ స్థానంలో నిలిచాడు. 2019లో 28 మ్యాచులు ఆడి 1490 పరుగులు పూర్తి చేశాడు.