కోహ్లీ అడ్డాలో రోహిత్ రికార్డులు వర్షం.. సచిన్ నుంచి గేల్ వరకు వెనకే..

11th OCT 2023

Pic credit - Instagram

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రపంచకప్-2023 మ్యాచ్‌లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌పై 8 వికెట్లతో ఘన విజయం సాధించింది.

IND VS AFG మ్యాచ్..

ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెను తుఫాను సృష్టించాడు. ఢిల్లీలో పరుగుల వర్షం కురిపిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

రోహిత్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. గేల్ 452 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు.

సిక్సర్ కింగ్‌గా రోహిత్..

ప్రపంచకప్‌లో రోహిత్ 1000 పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో డేవిడ్ వార్నర్‌తో కలిసి సమంగా నిలిచాడు. 1000 పరుగులు పూర్తి చేసేందుకు ఇద్దరూ 19 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

వార్నర్‌తో సమానంగా..

ఈ మ్యాచ్‌లో రోహిత్ పవర్‌ప్లేలోనే 76 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు.

పవర్‌ప్లేలో అద్భుతం..

ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ (7) వదిలిపెట్టాడు. ప్రపంచకప్‌లో సచిన్‌ పేరిట 6 సెంచరీలు ఉన్నాయి.

సచిన్ రికార్డ్ బ్రేక్..

ఈ మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో భారత్‌ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది.

రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ..