ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. ధోని రికార్డులో రోహిత్ చేరే ఛాన్స్

10th January 2024

Pic credit - Instagram

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌లో పునరాగమనం చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే T20 సిరీస్ లో ఆడనున్నాడు.

ఈ సమయంలో రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కెప్టెన్సీ పరంగా అతడు ఎంఎస్ ధోనీతో సమంగా నిలిచే ఛాన్స్ ఉంది. 

ఇందుకోసం భారత జట్టు సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 3-0తో ఓడించాల్సి ఉంటుంది. ధోని కెప్టెన్సీలో 72 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 42 గెలిచాడు. 

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించారు. 

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్, కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను ఎంచుకున్నారు.

రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నాడు. కెప్టెన్‌గా ధోని భారీ రికార్డును సమం చేయడానికి అతనికి గొప్ప అవకాశం ఉంది. 

రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన 51 మ్యాచ్‌ల్లో 39 మ్యాచ్‌లు గెలిచాడు. టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మకు మంచి అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లో భారత జట్టు 3-0తో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే, రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా 42 విజయాలు సాధించి ధోని రికార్డును సమం చేస్తాడు.