5 April 2024
TV9 Telugu
గత ఏడాది డిసెంబర్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన తరువాత, అభిమానులు చాలా కలత చెందారు.
IPL 2024 సీజన్‌లోని మొదటి 3 మ్యాచ్‌లలో ఇది చాలాసార్లు కనిపించింది. ఇక్కడ అభిమానులు స్టేడియంలో రోహిత్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓటమి పాలవడంతో రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతనికి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన కూడా చాలానే ఉంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు హైదరాబాద్ వచ్చే సీజన్‌లో రోహిత్‌ను తమ కెప్టెన్‌గా చేయడానికి సిద్ధమవుతోందని అంటున్నారు.
SRH యజమాని కావ్య మారన్ రోహిత్‌ని కెప్టెన్‌గా చేసేందుకు బ్లాంక్ చెక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే 5 సంవత్సరాలకు కావలసిన జీతాన్ని సిద్ధం చేసిందని అంటున్నారు.
చాలా మంది వినియోగదారులు దీనిపై స్పందిస్తున్నారు. అయితే ఈ వాదన నిజమేనా? ఇది నిజంగా జరుగుతుందా? ప్రస్తుతానికైతే సమాధానం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.
ఇది రోహిత్ శర్మ అభిమానులుగా పిలుచుకునే ఖాతాల నుంచి ఇలాంటి వార్తలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది మొత్తానికి ఫేక్ న్యూస్ అని స్పష్టమవుతోంది.
కాగా, ఓ సందర్భంలో రోహిత్ మాట్లాడుతూ.. తన మథర్ టంగ్ తెలుగు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తెలుగబ్బాయే హైదరాబాద్ కెప్టెన్‌గా కావాలని అంతా కోరుకుంటున్నారు.