ముంబై వద్దంది.. కట్‌చేస్తే.. రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..

17th December 2023

Pic credit - Instagram

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడంతో అతని అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు వారికి ఒక శుభవార్త వచ్చింది.

మీడియా కథనాల ప్రకారం, టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ సూచించింది.

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను టీమ్ ఇండియాకు మొదటి ఎంపిక కెప్టెన్.

రోహిత్ శర్మ ఇప్పుడు T20 ఇంటర్నేషనల్ నుంచి నిష్క్రమించవచ్చని, తదుపరి ప్రపంచ కప్‌లో అతనికి కెప్టెన్‌గా ఉండటం కష్టమని ఊహాగానాలు ఉన్నాయి.

సూర్యకుమార్ కేవలం 2 సిరీస్‌లలో మాత్రమే కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్‌ను మినహాయిస్తే బీసీసీఐకి మరో ఆప్షన్ లేకపోవడం పెద్ద విషయం. హార్దిక్ పాండ్యా తరచుగా అన్‌ఫిట్‌గా ఉంటాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు టీ20 ప్రపంచకప్ చివరి టోర్నీ కావచ్చు. అంటే, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు ఇదే అతనికి చివరి అవకాశం.

రోహిత్ శర్మరోహిత్ శర్మ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. తొలి టెస్టు డిసెంబర్ 26న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

ఐసీఎల్ 2024 మనీ వేలం డిసెంబర్   19న జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.