రీ ఎంట్రీకి సిద్ధమైన రిషబ్ పంత్.. 33 సెకన్ల వీడియోతో హింట్..

Pic credit - Instagram

6th December 2023

భారత క్రికెట్ అభిమానులు ఎవరైనా ఆటగాడి పునరాగమనం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే అది స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతేడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి పంత్ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు.

ఇది జరిగి ఓ సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా మారాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో పునరాగమనం చేయడం కష్టంగా అనిపించినా అందరి దృష్టి ఐపీఎల్ 2024పైనే ఉంది.

రిషబ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. తిరిగి రావడానికి తీవ్రంగా పోరాడుతున్నాడు. పంత్ తాఆగా 33 సెకన్ల వీడియోలో తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న పంత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బరువులు ఎత్తడంతోపాటు సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ జిమ్‌లో శిక్షణ పొందుతున్నాడు.

ఆ ప్రమాదంలో పంత్‌కి రెండు మోకాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైక్లింగ్‌, వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తుంటే మళ్లీ పునరాగమనంపై ఆశలు కలగడం సహజం.

ఐపీఎల్ 2024 మార్చిలో ప్రారంభం కానుంది. అంటే పంత్‌కు ఇంకా 3 నెలలు మిగిలి ఉన్నాయి. దీంతో ప్రాక్టీస్ మరింత ముమ్మరం చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రావొచ్చని భావిస్తున్నాడు.

రిషబ్ పంత్ వీడియో