కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. కట్‌చేస్తే.. రైనా రికార్డ్ బ్రేక్
TV9 Telugu
26 March 2024
IPL 2024 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PBKS)ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో RCB విజయానికి ఇద్దరు హీరోలు ఉన్నారు. ముందు విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో హాఫ్ సెంచరీతో దంచికొట్టగా.. ఆ తర్వాత దినేష్ కార్తీక్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టకున్నాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో హీరో విరాట్ కోహ్లీ 77 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పలు రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తొలి విజయం నమోదు చేసింది.
టీ20 క్రికెట్‌లో కోహ్లికి ఇది 100వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రన్ మెషీన్ నిలిచాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టి కోహ్లీ మరో భారీ రికార్డు సృష్టించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు (174) పట్టిన భారత ఫీల్డర్‌గా కోహ్లీ నిలిచాడు. 172 క్యాచ్‌లు పట్టిన సురేష్ రైనాను కోహ్లీ అధిగమించాడు.
కోహ్లి ఇప్పటివరకు 378 టీ20 మ్యాచ్‌లు ఆడి 92 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలతో 12092 పరుగులు చేశాడు.
టీ20 ఇంటర్నేషనల్ (భారత్), ఆర్‌సీబీ ఫ్రాంచైజీ, డొమెస్టిక్ టీ20లను కలిపి విరాట్ కోహ్లీ ఈ పరుగులు సాధించాడు.