ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

TV9 Telugu

1 November 2024

ఐపీఎల్ 2025 కోసం మొత్తం 10 జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.

రిటైన్ జాబితా విడుదల

కొందరు స్టార్ ప్లేయర్లు విడుదల కాగా, ఊహించని ప్లేయర్లు రిటైన్ చేశారు. 

స్లార్ ప్లేయర్లు విడుదల

హెన్రిచ్ క్లాసెన్ అత్యధికంగా రూ.23 కోట్లకు రిటైన్ అయ్యాడు. కాగా విరాట్‌ను 21 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. 

క్లాసెన్‌పై కాసుల వర్షం

ఈ సీజన్‌లో అత్యధిక మొత్తం చెల్లించి క్లాసెన్‌ను అట్టిపెట్టుకున్నప్పటికీ, ఐపీఎల్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 

విరాట్ ఇప్పటికీ నంబర్ 1

విరాట్ కోహ్లి ఐపీఎల్ జీతం ద్వారా ఇప్పటివరకు రూ.209.2 కోట్లు సంపాదించాడు. 

రూ. 200 కోట్లు దాటింది

ఈ విషయంలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటి వరకు 196 కోట్ల 50 లక్షలు సంపాదించాడు. 

రెండో స్థానంలో రోహిత్

విరాట్ కోహ్లీని RCB నంబర్ వన్ స్థానంలో ఉంచింది. అతను ఈ సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా చేయగలడు.

విరాట్ కెప్టెన్ కావచ్చు

గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్‌ డు ప్లెసిస్‌ను కూడా ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకోలేదు.

డుప్లెసిస్‌ను రిటైన్ చేయలేదు