కుంబ్లే రికార్డును బద్దలు కొట్టేందుకు అశ్విన్ సిద్ధం.. అదేంటంటే?
TV9 Telugu
29 October 2024
వాంఖడే స్టేడియంలో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టేందుకు ఆర్ అశ్విన్ ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.
భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ స్టేడియంలో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడి 38 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టులో కుంబ్లే రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు అశ్విన్‌కు అవకాశం ఉంది.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వికెట్ల టేకర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఈ స్టేడియంలో 5 టెస్టుల్లో 38 వికెట్లు సాధించాడు. దీంతో కుంబ్రే రికార్డ్‌కు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో కివీస్ జట్లు ఆధిక్యం సాధించింది. 2 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది.
ఇక ముంబై టెస్ట్‌లో విజయం సాధించాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో గెలవకపోతే క్లీన్ స్వీప్ అవుతుంది.
నవంబర్ 1 నుంచి ముంబైలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, కివీస్ భారత్‌లో సరికొత్త చరిత్ర లిఖించనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..