అద్భుతం చేసిన ద్రవిడ్ కుమారుడు.. కోహ్లీ, బాబర్‌లను మించిపోయాడుగా..

21st December 2023

Pic credit - Instagram

రాహుల్ ద్రవిడ్ కుమారులిద్దరూ ఆయన బాటలోనే నడుస్తున్నారు. సమిత్, అన్వయ్‌ల బ్యాటింగ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన జట్టును అద్భుత విజయానికి చేర్చాడు. సమిత్ 98 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

సమిత్ ద్రవిడ్ తన ఇన్నింగ్స్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌ను కొట్టాడు. ఇందులో అతని బ్యాలెన్స్ నిజంగా అద్భుతంగా ఉంది. ఈ షాట్‌ను విరాట్-బాబర్ కవర్ డ్రైవ్‌తో పోల్చారు.

సమిత్ ద్రవిడ్ జమ్మూకశ్మీర్ బౌలర్లను చిత్తు చేశాడు. ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దీంతో సమిత్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు.

సమిత్ ద్రవిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. ఇది కాకుండా మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. అయితే అతని దృష్టి బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఉంది.

కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ ఉత్తరాఖండ్‌తో ఆడుతున్నప్పుడు, ఆయన తండ్రి రాహుల్ ద్రవిడ్ కూడా అతని మ్యాచ్ చూడటానికి వచ్చారు.

రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. అయితే, ప్రస్తుతం సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నారు.

రాహుల్ ద్రవిడ్ కుమారుడు ప్రస్తుతం అద్భుతమైన ఫాంతో ముందుకు వెళ్తున్నాడు. దీంతో నెటిజన్లు కూడా టీమిండియాకు భవిష్యత్‌లో ఆడాలని కోరుకుంటున్నారు.