ప్రపంచకప్‌లో 3 సెంచరీలు.. సచిన్-విరాట్‌ను వెనక్కునెట్టిన డికాక్..

24th OCT 2023

Pic credit - Instagram

ప్రపంచకప్‌2023 లో రోహిత్, విరాట్ కోహ్లిల బ్యాటింగ్‌పై జనాలు పిచ్చెక్కిస్తున్నప్పటికీ, తన బ్యాట్‌తో ఈ దిగ్గజాలకు ప్రత్యక్ష పోటీని అందించిన ఆటగాడు మరొకరు ఉన్నారు. 

ప్రపంచకప్‌2023 లో

2023 ప్రపంచకప్‌లో సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ ప్రత్యర్థులకు షాకులు ఇస్తోన్న క్వింటన్ డి కాక్ గురించే మనం మాట్లాడుతున్నాం. 

సెంచరీల మీద సెంచరీలు

మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో డికాక్‌కి ఇది మూడో సెంచరీ.

డికాక్‌కి ఇది మూడో సెంచరీ

ఈ ప్రపంచకప్‌లో శ్రీలంకపై డికాక్ తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై రెండో సెంచరీ బాదేశాడు. మ్యాచ్ ఏదైనా శతకం పక్కా అంటున్నాడు.

శ్రీలంకపై డికాక్ తొలి సెంచరీ

బంగ్లాదేశ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ప్రపంచకప్‌లో మూడో సెంచరీ సాధించిన వెంటనే డి కాక్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. సచిన్, విరాట్ లాంటి దిగ్గజాలను ఓడించాడు.

మూడో సెంచరీ

ప్రపంచకప్‌లో 3 సెంచరీలు సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా క్వింటన్ డి కాక్ నిలిచాడు. ఈ రికార్డు 2011లో 2 సెంచరీలు చేసిన డివిలియర్స్ పేరిట ఉంది. 

తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా

అయితే ఒకే ప్రపంచకప్‌లో అత్యధికంగా 5 సెంచరీలు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. తాజాగా ఓ సెంచరీతో రోహిత్ ఓ సెంచరీ చేశాడు. 

5 సెంచరీలు

డి కాక్ వన్డేల్లో తన 20వ సెంచరీని సాధించాడు. అతను కేవలం 150 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 20 సెంచరీలు చేసిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు. 

20వ సెంచరీ