యూఎస్, భారత్‌ చేతిలో ఓటమి.. భారీగా నష్టపోయిన పాకిస్తాన్

TV9 Telugu

14 June 2024

టీ20 ప్రపంచకప్ 2024 లో సూపర్-8 రేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సతమతమవుతోంది. గ్రూప్ Aలో చేరిన ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయింది.

ఈ కారణంగా పాకిస్తాన్ ముందుకు సాగే మార్గం నిలిచిపోయింది. ఇప్పుడు అంతా చివరి మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది.

ప్రస్తుతం అమెరికా రెండో స్థానంలో ఉంది. సూపర్-8కి వెళ్లే బలమైన అవకాశం ఉంది. నేటితో గ్రూప్ ఏ కథ తేలిపోనుంది. పాక్ మాత్రం యూఎస్ ఓడిపోవాలని కోరుకుంటుంది.

ఈ టోర్నీలో పాక్ 2 మ్యాచ్‌లు ఓడిపోవడంతో సూపర్-8కి వెళ్లే మార్గం కష్టతరంగా మారడమే కాకుండా ఆర్థికంగానూ నష్టపోయింది.

ఐసీసీ ప్రైజ్ మనీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 వరకు ప్రతి మ్యాచ్‌లో గెలిచినందుకు ప్రైజ్ మనీని కూడా చేర్చింది. 

ఒక్కో మ్యాచ్ విజయంపై జట్టుకు రూ.25.9 లక్షలు లభిస్తుంది. పాక్ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రూ.51.8 లక్షల నష్టాన్ని చవిచూసింది. 

పాకిస్థాన్‌ను ఓడించి  అమెరికా రూ.25.9 లక్షలు పొందింది. ఈ జట్టు సూపర్-8కి వెళితే ప్రైజ్ మనీని పెంచుకునే అవకాశం ఉంటుంది.

టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ గురించి మాట్లాడితే.. ఈసారి విజేత జట్టుకు రూ.20.36 కోట్లు, ఓడిన జట్టుకు రూ.10.64 కోట్లు లభిస్తాయి.