కొత్త బంతితో జోరో.. షాహీన్ అఫ్రిదిని చితక్కొడుతోన్న ప్రత్యర్థులు..

23rd OCT 2023

Pic credit - Instagram

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వికెట్ టేకింగ్ సామర్థ్యానికి ప్రసిద్ధిగాంచాడు. ముఖ్యంగా, కొత్త బంతితో వికెట్లు తీయడంలో నేర్పరి. 

ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది

అయితే ఈ ప్రపంచకప్‌లో గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌లు షాహీన్ అఫ్రిదిపై తేలిగ్గా పరుగులు సాధిస్తున్నారు. 

గణాంకాలు

షాహీన్ అఫ్రిది కొత్త బంతితో భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మరోసారి షాహీన్ అఫ్రిది కొత్త బంతితో వికెట్ తీయలేకపోయాడు.

భారీగా పరుగులు

షాహీన్ అఫ్రిది వేసిన తొలి 3 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ 16 పరుగులు చేశారు. అయితే షాహీన్ అఫ్రిదీకి ఎలాంటి వికెట్ దక్కలేదు. 

ఎలాంటి వికెట్ దక్కలేదు

షాహీన్ అఫ్రిది ఆస్ట్రేలియాపై 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చాడు. అయితే మరోసారి షాహీన్ ఆఫ్రిది కొత్త బంతితో వికెట్ తీయలేకపోయాడు. 

కొత్త బంతితో వికెట్ లేదు

కాగా, భారత్‌పై షాహీన్ అఫ్రిది కొత్త బంతితో శుభ్మన్ గిల్ వికెట్ పడగొట్టాడు. కానీ, భారత బ్యాట్స్‌మెన్స్ 18 బంతుల్లో 17 పరుగులు చేశారు. 

భారత్‌పై మాత్రమే వికెట్

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది 3 ఓవర్లలో 22 పరుగులు చేసినా వికెట్ సాధించలేదు. అలాగే నెదర్లాండ్స్‌పైనా 19 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టలేదు.

శ్రీలంకపై తుస్సు

49 మ్యాచ్‌ల్లో షాహీన్ ఆఫ్రిది వన్డే ఫార్మాట్‌లో 95 వికెట్లు పడగొట్టాడు. 27 టెస్టు మ్యాచ్‌ల్లో 105 వికెట్లు, టీ20 ఫార్మాట్‌లో 52 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు ఉన్నాయి.

షాహీన్ ఆఫ్రిది  కెరీర్