మరో సెంచరీ బాదిన క్వింటన్ డి కాక్.. రోహిత్ రికార్డ్‌కు బ్రేక్?

1st Nov 2023

Pic credit - Instagram

ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా నిలకడగా రాణిస్తోంది. ఆ జట్టు వెటరన్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఇందులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు.

నిలకడగా రాణిస్తోన్న సౌతాఫ్రికా..

డికాక్ మరో సెంచరీతో సత్తా చాటాడు. దీంతో న్యూజిలాండ్‌పై భారీ స్కోర్ సాధించింది. 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.

డి కాక్ అద్భుతం..

టోర్నీ ఆరంభం నుంచి డి కాక్ విపరీతంగా పరుగులు సాధిస్తూ సెంచరీలు బాదుతున్నాడు. నేడు న్యూజిలాండ్‌పైనా సెంచరీ బాది ఆ సంఖ్యను నాలుగుకు చేర్చాడు.

మళ్లీ సెంచరీ

పుణెలో న్యూజిలాండ్‌పై డి కాక్ మరో సెంచరీ సాధించాడు. డి కాక్ 103 బంతుల్లో ఈ సెంచరీ సాధించాడు. 2023 ప్రపంచకప్‌లో డికాక్‌కి ఇది నాలుగో సెంచరీ.

నాలుగోసారి సెంచరీ

దీంతో దక్షిణాఫ్రికా దిగ్గజం తనకంటే ముందు రోహిత్ శర్మ, కుమార సంగక్కర మాత్రమే చేయగలిగిన అద్భుతం చేశాడు.

రోహిత్‌లా అద్భుతం

ప్రపంచ కప్‌లో 4 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2015లో సంగక్కర (4), 2019లో రోహిత్ (5) ఈ ఘనత సాధించారు.

మూడో బ్యాట్స్‌మన్‌గా

అంతే కాదు ఈ ప్రపంచకప్‌లో డికాక్ 500కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

చరిత్ర సృష్టించింది

డికాక్‌కి ఇదే చివరి ప్రపంచకప్‌. ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు టోర్నీ ప్రారంభానికి ముందే ప్రకటించాడు.

ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్