అన్న రికార్డులను బద్దలు కొట్టిన తమ్ముడు.. అవేంటంటే?

31st January 2024

TV9 Telugu

ఖాన్ సోదరులు భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. అంటే సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వరుస సెంచరీలతో దూసుకపోతున్నారు. 

ముషిన్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్ 2024లో రెండో సెంచరీ సాధించాడు. ఈసారి న్యూజిలాండ్ జట్టును టార్గెట్ చేశాడు.

ముషీర్ ఖాన్ న్యూజిలాండ్‌పై 131 పరుగులు చేశాడు. ఇది అండర్-19 ప్రపంచకప్‌లో ఈ జట్టుపై ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.

ఈ రికార్డు అంతకుముందు 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో 74 పరుగులు చేసిన ముషీర్ అన్నయ్య సర్ఫరాజ్ ఖాన్ పేరిట ఉంది.

ముషీర్ తన అన్నయ్య పేరిట 8 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో భారత టెస్ట్ జట్టులో ఎంపికైన ఒక రోజు తర్వాత ముషీర్ తన అన్నయ్య రికార్డును బద్దలు కొట్టాడు.

అన్నయ్య సర్ఫరాజ్ తనకు ఫోన్ చేసి టీమ్ ఇండియాలో తన ఎంపిక గురించి తెలియజేశాడని ముషీర్ చెప్పాడు. అరంగేట్రం చేయాలని కోరుకుంటున్నాను.

కాగా, ఇన్ని రోజులుగా ఎదురుచూస్తోన్న అవకాశం ఎట్టకేలకు సర్పరాజ్‌ను వరించింది. దీంతో ప్రస్తుతం ఈ ఆటగాడు ఇంగ్లండ్ టెస్ట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.