ఐపీఎల్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు..

TV9 Telugu

02  April 2024

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవమైన ఆటతీరును కనబరుస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ ఓటమితో ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలుస్తోంది. 

ఐపీఎల్ చరిత్రలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పలు రికార్డులు సృష్టించాడు. అయితే ఇప్పుడు ఓ చెత్త రికార్డును కూడా హిట్ మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 1న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో సహా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 

ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ డకౌట్ కావడం ఇది 17వ సారి. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్ అయిన దినేష్ కార్తిక్ రికార్డును హిట్ మ్యాన్ సమం చేశాడు. 

రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ తర్వాత 15 డకౌట్లతో పీయూష్ చావ్వాల, మనుదీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నారు. 

అలాగే అంబటి రాయుడు, మనీశ్ పాండే, రషీద్ ఖాన్‌లు 14 డకౌట్లతో ఇందులో మూడో స్థానంలో నిలుస్తున్నారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. రోహిత్ శర్మతో పాటి హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియా వేదికగా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా వైదొలగాలని.. కెప్టెన్సీని తిరిగి రోహిత్ శర్మకు ఇచ్చేయాలని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.