ముంబై కొంపముంచిన కెప్టెన్ మార్పు.. రోహిత్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే?
16th December 2023
Pic credit - Instagram
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించింది. ఈ ఆటగాడు గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ముంబయిపై దుష్ప్రభావం చూపుతోంది. కొత్త కెప్టెన్‌ను ప్రకటించినప్పటి నుంచి ఈ ఫ్రాంచైజీ 6 లక్షల మంది అభిమానులను కోల్పోయింది.
రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్‌పై చాలా కోపంగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది, ట్విట్టర్‌లో 4 లక్షల మంది ఈ టీమ్‌ను అన్‌ఫాలో చేశారు.
ఇది మాత్రమే కాదు, చాలా మంది అభిమానులు ముంబై ఇండియన్స్ జెర్సీని కూడా తగలబెడుతున్నారు. ఎంఐ జెండాలను కూడా కాల్చేస్తూ, తమ అసహానాన్ని చూపిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలిచాడని ఎంఐ యాజమాన్యానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో ఎలా మారుతుందో చూడాలి.
రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. హార్ట్‌బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేశాడు.
ఇప్పుడు రోహిత్ శర్మ ఏం చేస్తాడనేది ప్రశ్నగా మారింది. అతను ముంబై ఇండియన్స్ జట్టులో ఉంటాడా, లేదా, అసలు ఐపీఎల్ 2024 ఆడతాడా లేదా అనేది చూడాలి.