ఐపీఎల్‌లో సిక్సర్ల రికార్డు.. అగ్రస్థానంలో ఏ జట్టు ఉందో తెలుసా?
IPL 2024 ప్రారంభం కానుంది. మార్చి 22న, మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది.
తొలి మ్యాచ్‌లో ఇద్దరు దిగ్గజాల పోటీ పడనుండడంతో.. ఈ మ్యాచ్‌తోనే అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. దీంతో ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అన్నిజట్లు తమ ప్రాక్టీస్ షురూ చేశాయి. అయితే, కొన్ని జట్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నాయి. మరికొన్ని ట్రోఫీ కోసం తగ్గేదేలే అంటున్నాయి. కాగా, కొన్ని జట్లలోకి గాయాల నుంచి కోలుకుని కొంతమంది ప్లేయర్లు తిరిగి వస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ఏ జట్టు అత్యధిక సిక్సర్లు కొడుతుందో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, సీజన్ ప్రారంభమయ్యే ముందు, ఈ రేస్‌లో ఏ జట్టు ముందుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సిక్సర్ల రేసులో గుజరాత్ టైటాన్స్ 203 సిక్సర్లతో అట్టడుగున ఉంది. లక్నో జట్టు 230 సిక్సర్లతో 8వ స్థానంలో ఉండగా, 860 సిక్సర్లతో SRH ఉంది.
ఆండ్రీ రస్సెల్ జట్టు KKR కూడా ఇప్పటివరకు 1351 సిక్సర్లు కొట్టగలిగింది. పంజాబ్ తర్వాత 5వ స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు 1393 సిక్సర్లు కొట్టింది.
ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం 214 మ్యాచ్‌ల్లో మొత్తం 1322 సిక్సులు బాదింది. ఈ లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. ఇక నాలుగో స్థానంలో పంజాబ్ 1309 సిక్సులతో నిలిచింది.
రోహిత్ శర్మ టీం ముంబై ఇండియన్స్ అత్యధికంగా 235 మ్యాచ్‌ల్లో 1442 సిక్సులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బెంగళూరు జట్టు నిలిచింది. ఆ జట్టు 1433 సిక్సులు బాదింది.