01 December 2023

టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ నిజంగా సింప్లీ సూపర్బ్.

ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్‌, షేక్‌ హ్యాండ్స్‌, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్‌. 

తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఓ చోట మిస్టర్‌ కూల్‌ను చూసిన అభిమాని ఒకరు ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలనుకున్నారు.

ఈ క్రమంలో తన బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలంటూ ధోనీని కోరారు. ఫ్యాన్ కోరిక మేరకు ధోనీ బైక్ ముందు భాగంలో సంతకం చేసేందుకు సిద్ధమయ్యారు.

కానీ.. బైక్ మీద మరకలు కనిపించడంతో తన టీషర్టుతో స్వయంగా దానిని శుభ్రం చేసి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు.

అనంతరం బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను ఖుషీ చేశారు. అంతేకాదు, ఆ బైక్‌పై కూర్చొని దాని విశేషాలను కూడా అడిగి తెలుసుకున్నారు ధోనీ.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.