ఎంఎస్ ధోని తుఫాన్ ఇన్నింగ్స్.. దెబ్బకు రిజ్వాన్ రికార్డ్ బ్రేక్..

1 April 2024

TV9 Telugu

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 

ఈ మ్యాచ్‌‌లో పాత ఎంఎస్ ధోనీని అభిమానులు చూశారు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా ధోని తన పేరిట ఒక ముఖ్యమైన రికార్డును కూడా సృష్టించాడు. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన స్పెషలిస్ట్ వికెట్‌కీపర్‌గా మూడో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. 

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోనా ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసిన తీరుపై అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

దీంతో ఎంఎస్ ధోని కూడా తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. స్పెషలిస్ట్ వికెట్‌కీపర్‌ల జాబితాలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 

ప్రస్తుతం ధోని టీ20 క్రికెట్‌లో 7036 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 6962 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ (8578 పరుగులు) పేరిట ఉంది.  ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (7721 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.