టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ ఎవరో తెలుసా? షాకింగ్ పేరు
TV9 Telugu
21 August 2024
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 137 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు.
రెండో స్థానంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ 144 ఇన్నింగ్స్‌లలో 78 సిక్సర్లు కొట్టాడు.
మూడో స్థానంలో ఉన్న టీమిండియా ప్రస్తుత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఆడిన 56 ఇన్నింగ్స్ ల్లో 55 సిక్సర్లు బాదాడు.
ప్రస్తుత వికెట్ కీపర్లలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉండటంతో గిల్ క్రిస్ట్ రికార్డును బద్దలు కొడతాడనడంలో సందేహం లేదు.
114 ఇన్నింగ్స్‌ల్లో 54 సిక్సర్లు బాదిన మరో ఆసీస్ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ బ్రెండన్ మెకల్లమ్ 34 సిక్సర్లు బాదాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..