అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన టీమిండియా ప్లేయర్లు.. ఫస్ట్ ప్లేస్‌లో కోహ్లీ

04 Sep 2023

Pic credit - Instagram

క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయని మనం వింటూనే ఉన్నాం. అందుకే బరిలోకి దిగిన ప్లేయర్లు క్యాచ్‌లు పట్టేందుకు ప్రానాలు ఫణ్ణంగా పెడుతుంటారు.

క్యాచ్‌లే మ్యాచ్‌లు గెలిపిస్తాయి..

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు తొలి 21 బంతుల్లోనే 3 క్యా్చ్‌లు మిస్ చేశారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

నేపాల్ మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు మిస్..

మొత్తంగా ప్రపంచకప్ 2019 నుంచి ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో అత్యధికంగా క్యాచ్‌లు మిస్ చేసిన టీమిండియా ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

2019 ప్రపంచ కప్ నుంచి..

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొత్తంగా 14 క్యాచ్‌లు మిస్ చేసి, అగ్రస్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ 14

టీమిండియా వికెట్ కీపర్ కం లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ రిషబ్ పంత్ 5 క్యాచ్‌లు డ్రాప్ చేసి, రెండో స్థానంలో నిలిచాడు.

రిషబ్ పంత్ 5

టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కూడా 5 క్యాచ్‌లు డ్రాప్ చేసి, మూడో స్థానంలో నిలిచాడు.

శ్రేయాస్ అయ్యర్ 5

టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రపంచకప్ 2019 నుంచి మొత్తంగా 4 క్యాచ్‌లు డ్రాప్ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

రోహిత్ 4

టీమిండియా టెస్ట్ ప్లేయర్ అజింక్యా రహానే కూడా 4 క్యాచ్‌లు డ్రాప్ చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

రహానే 4

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ లిస్టులో చివరి స్థానంలో నిలిచాడు. మొత్తంగా జడ్డూ 4 క్యాచ్‌లు డ్రాప్ చేసి ఆరో స్థానంలో నిలిచాడు.

జడేజా 4