తొలి టెస్ట్‌కు ముందు సిరాజ్ భావోద్వేగం.. అంత ఈజీ కాదంటూ..

24th January 2024

Pic credit - Instagram

TV9 Telugu

మహ్మద్ సిరాజ్ తన అరంగేట్ర టెస్టును గుర్తు చేసుకుంటూ భారీ రియాక్షన్ ఇచ్చాడు. తండ్రి మరణానంతరం ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం అంత సులువు కాదంటూ చెప్పుకొచ్చాడు.

సిరాజ్ మాట్లాడుతూ, మా నాన్న కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. అది అతనికి చాలా కష్టమైన ప్రదేశమని భావోద్వేగం చెందాడు.

కాగా, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఆ టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా బాగుంది. భారత జట్టు కూడా సిరీస్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

ఇది నాకు చాలా కష్టమైన సమయం. ఎందుకంటే మా నాన్నగారు మరణించారు. మేం క్వారంటైన్‌లో ఉన్నాం. కాబట్టి ఎవరూ వచ్చి మమ్మల్ని కలవలేరు. నేను కూడా ఒంటరిగా ఉన్నానంటూ తెలిపాడు. 

అది నాకు చాలా కష్టమైన దశ. క్రమంగా నా కుటుంబ సభ్యులతో మాట్లాడటం మొదలుపెట్టాను. నన్ను నేను ఓదార్చుకున్నాను. మా నాన్నకు కూడా నేను ఏదో ఒక రోజు భారత్‌ తరపున ఆడాలనేదే కల. 

నేను మా అమ్మతో మాట్లాడాను. నా ఆటపై దృష్టి పెట్టాలని, మా నాన్న కలను నెరవేర్చాలి అని ఆమె నాతో చెప్పిందని గుర్తు చేసుకున్నాడు. 

జట్టులో ఇతర బౌలర్లు కూడా ఉన్నందున నాకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. నేను తొలి మ్యాచ్‌ ఆడలేదు. రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాను. 

టెస్టు క్రికెట్‌కు భిన్నమైన గౌరవం ఉంది. మెల్‌బోర్న్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద మైదానంలో నా అరంగేట్రం చేశాను. మా నాన్న కల నెరవేరిందని తెలిపాడు.