భారత్‌కు భారీ షాక్.. టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ ఔట్

2nd February 2024

TV9 Telugu

భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడు భారత్ - ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమవుతాడని సమాచారం.

షమీ తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టులో లేడు. అయితే, మూడో టెస్టు నాటికి జట్టులో చేరుతాడని భావించారు. కానీ, అది కుదిరడంలేదు.

భారత పేసర్ మహ్మద్ షమీ ఇంకా గాయంతో బాధపడుతుండడంతో 3వ టెస్టు నాటికి అతడు కోలుకునే అవకాశం లేదని అంటున్నారు. 

వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి షమీ భారత జట్టులో చోటు దక్కించుకోలేదు. చీలమండ గాయంతో బాధపడుతున్నాడు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, షమీ కిందకు దిగుతున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా ఇంజెక్షన్లు తీసుకుంటున్నాడు.

IPL 2024 కోసం అందుబాటులో ఉండేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, షమీని తీసుకొచ్చేందుకు బీసీసీఐ తొందరపడటం లేదు.

ఎందుకంటే టీ20 ప్రపంచకప్ నాటికి షమీ పూర్తి ఫిట్‌గా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. అందుకే షమీ విషయంలో తొందరపడడంలేదు. 

ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ భారత పేస్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నారు. 

మరోవైపు రెండో టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో లేరు. దీంతో అనుభవం లేని ప్లేయర్లతో రోహిత్ ఆడనున్నాడు.