కావ్య పాప ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెల్సా? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే 

Anil Kumar

26 May 2024

సన్‌నెట్‌వర్క్‌ చీఫ్ కళానిధి మారన్‌, కావేరీ మారన్‌ దంపతుల ముద్దుల కుమార్తే కావ్య మారన్‌.  1992 ఆగస్టు 6న చెన్నైలో ఆమె పుట్టారు.

బిజినెస్‌పై ఆసక్తితో ఎంబీఏ చేసిన కావ్యకు.. ఏవియేషన్‌, మీడియా అంటే ఇష్టం. ప్రస్తుతం ఆమె ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓగా, కో ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. 

కావ్య ఆస్తుల విలువ 4 వేల కోట్లు పైమాటే.. మన దేశంలో అత్యంత సంపద కలిగిన యంగ్ ఎంటర్‌ప్యూనర్స్‌లో ఆమె ఒకరు

కావ్యకు క్రికెట్ అంటే ఇష్టం.. తన ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. షారుక్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, దిశా పటాని ఆమెకు ఇష్టమైన సినిమా స్టార్స్ 

కావ్య మారన్‌ ఫ్యామిలీకి కేవలం బిజినెస్‌ మాత్రమే కాకుండా రాజకీయ పరంగానూ మంచి పలుకుబడి, సొసైటీ లో పలుకుబడి ఉంది.

కావ్య మారన్‌ వాళ్ల తాత మురసోలి మారన్‌ డీఎంకే పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

కావ్య బాబాయ్‌ దయానిది మారన్‌ గతంలో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి.. కావ్య వాళ్ల తాతయ్యకు స్వయానా మామయ్య.

మొదట్లో.. ఐపీఎల్‌ వేలంలో కనిపించి ‘మిస్టరీ గర్ల్‌’ అనిపించుకున్న కావ్య.. ఈ సీజన్‌లో మీమ్స్‌ క్వీన్‌గా కుర్రకారు సెల్‌ఫోన్లలో వైరల్‌ అవుతోంది.