వేలానికి ముందే రోహిత్‌ని కొనుగోలు చేసేందుకు సిద్ధం

TV9 Telugu

1 September 2024

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో రోహిత్ శర్మ భాగమవుతాడా లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

మెగా వేలం

గత సీజన్‌లో రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి ఎంఐ తొలగించింది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు జట్టు నుంచి వైదొలగే అవకాశం ఉందని నమ్ముతున్నారు. 

కెప్టెన్సీ నుంచి ఔట్

అయితే, రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాతో పాటు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందరి దృష్టి రోహిత్‌పైనే

రోహిత్ విడుదలైతే వేలంలో కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ జట్టు కోచ్ కీలక ప్రకటన చేశాడు. ఈ కోచ్ ప్రకారం అతని జట్టు రోహిత్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు.

రోహిత్ కోసం వెయిటింగ్

లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ మాట్లాడుతూ, 'రోహిత్ శర్మ వేలంలోకి వస్తే, LSG అతన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

స్వాగతించేందుకు లక్నో సిద్ధం

రోహిత్ చాలా గొప్ప ఆటగాడు. అతన్ని కొనుగోలు చేయడానికి ప్రతి జట్టు సంతోషంగా ఎదురుచూస్తోంది.

జాంటీ రోడ్స్ కీలక ప్రకటన

రోహిత్‌ను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 కోట్లు కేటాయించినట్లు గతంలో ఒక నివేదిక పేర్కొంది.

నివేదికలో కీలక విషయాలు

రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడు. ఈ సమయంలో, అతను కెప్టెన్‌గా జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా చేశాడు. 

2011 నుంచి MIలో భాగం

ఐపీఎల్ 2022కి ముందు ముంబై జట్టు రోహిత్‌ను రూ.16 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. మరి ఈసారి ఆయన్ను రిటైన్ చేస్తారా లేదా అనేది చూడాలి.

రిటైన్ చేస్తారా?