TV9 Telugu

17 March 2024

ధోని ఇలాఖాలో మరో డైనమేట్.. కట్‌చేస్తే.. రూ. 7.20 కోట్లతో ఢిల్లీలో మెరుపులు

రాంచీ నుంచి కుశాగ్ర ధోని లాగా మారకపోవచ్చు. కానీ, అతను ఖచ్చితంగా తన భూమితో కనెక్ట్ అయ్యాడు. అతను జార్ఖండ్‌లోని బొకారో నివాసి.

సచిన్‌ని తన ఆరాధ్యదైవం, ధోనీగా చూసి వికెట్‌కీపింగ్‌లో మెలకువలు నేర్చుకున్న కుమార్ కుషాగ్రాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది.

కుమార్ కుషాగ్రాకు అడుగడుగునా తన తండ్రి మద్దతు ఉంది. లేకుంటే ఐపీఎల్‌కు చేరుకునే ప్రయాణం అంత సులభం ఉండేది కాదు.

స్వతహాగా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న తండ్రి వల్లే అతడు ఈరోజు క్రికెటర్ అయ్యాడు. తండ్రి మొదట పుస్తకం నుంచి చదివి ఆతర్వాత దానిని తన కొడుకుకు వివరిస్తాడు.

రాత్రి 8 నుంచి 12 వరకు కుశాగ్రా ప్రాక్టీస్ చేసేందుకు.. ఆయన తండ్రి ఇంట్లో వలలు అమర్చాడు. దీంతో ఎటువంటి ఖర్చు లేకుండానే శిక్షణ మొదలుపెట్టాడు.

తాను ధోనీలా మారలేనని, అయితే అతడిని కలిసినప్పుడల్లా చాలా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని కుశాగ్రా అభిప్రాయపడ్డాడు.

రిషబ్ పంత్ రాకతో జట్టు వాతావరణం చాలా మారిపోయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పంత్ నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు.

కుమార్ కుషాగ్రా దేశవాళీ క్రికెట్‌లో 11 T20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ 117 కంటే ఎక్కువ. అతను 8 క్యాచ్‌లు, 1 స్టంపింగ్ చేశాడు.