రోహిత్, కోహ్లి ఎంపికతో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు భారీ నష్టం?
8 April 2024
TV9 Telugu
14 నెలల తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని T20 జట్టులో చేర్చడం ద్వారా సెలెక్టర్లు సురక్షితమైన విధానాన్ని అవలంబించారు. అయితే ఈ నిర్ణయం భారత్‌కు భారీగా నష్టం కానుందా?
గత రెండు టీ20 ప్రపంచకప్‌లలో టైటిల్ గెలవలేకపోయిన రోహిత్, కోహ్లి.. మరో అవకాశం ఇవ్వాలని కోరడాన్ని తప్పుపట్టలేం. 2022 నవంబర్‌లో సెమీ-ఫైనల్స్‌లో ఓటమి తర్వాత జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు.
జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీలను జట్టులో చేర్చారు. ఈ ఇద్దరు దిగ్గజాలు అమెరికాలో జరగనున్న ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగమవుతారని ఇది స్పష్టమైన సూచన.
ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ODI ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే వీరి ఆట పొట్టి ఫార్మాట్ అవసరాలకు సర్దుబాటు చేయగలరా అనేది ప్రశ్నర్థకంగా మారింది.
మరోవైపు విరాట్ కోహ్లి ఆట 50 ఓవర్ల ఫార్మాట్‌కు బాగా సరిపోతుంది. కానీ, అతను ఆడిన 148 T20 మ్యాచ్‌లలో అతను 137.96 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది.
దీనికి విరుద్ధంగా ప్రపంచ అత్యుత్తమ T20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 170 కంటే ఎక్కువగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో ఆడి తూచి ఆడడంతో భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
జైస్వాల్, రుతురాజ్ లు తమకు లభించిన అవకాశాలలో తమ సత్తా చాటారు. అయితే ఐసీసీ పోటీలలో అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు. గవాస్కర్, గంగూలీ కూడా రోహిత్, కోహ్లీని చేర్చాలని వాదించారు.
భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ కూడా రోహిత్, కోహ్లిలను జట్టులోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. దీని వల్ల జైస్వాల్, గైక్వాడ్‌లకు జట్టులో చోటు దక్కడం కష్టమే.
రోహిత్, కోహ్లీలను ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని స్పష్టం చేశారు. సెలెక్టర్లు ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉందని, వారిలో ఎవరినీ వదిలిపెట్టలేమని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.