ఆడలేవంటూ పక్కన పెట్టిన ముంబై.. కట్‌చేస్తే.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో హల్చల్

TV9 Telugu

25  March 2024

గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి మ్యాచ్‌లోనే కొన్ని నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తర్వాత సునీల్ నరైన్ కేకేఆర్‌కు ఓపెనింగ్‌కి రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. 

గత 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున బెంచ్‌పై కూర్చున్న రమణదీప్ సింగ్‌ను KKR ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చింది. దీంతో గంభీర్‌ను ప్లాన్ ఎవ్వరికీ అర్ధం కాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నరేన్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ, రమణదీప్ సింగ్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత అభిమానులందరూ ఈ ఆటగాడి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

రమణదీప్ సింగ్ గురించి మాట్లాడితే గత 2023 IPL సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఆ తర్వాత ముంబై అతన్ని విడుదల చేసింది. KKR ఈ ఆటగాడిని రూ. 20 లక్షలు చెల్లించి జట్టులో చేర్చుకుంది. ఇప్పుడు రమణదీప్ తొలి మ్యాచ్‌లోనే సరైనదని నిరూపించాడు. దీంతో ముంబైకి గట్టి షాక్ ఇచ్చాడు.

చండీగఢ్‌కు చెందిన 27 ఏళ్ల రమణ్‌దీప్ సింగ్ హైదరాబాద్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ 51 పరుగుల వద్ద 4 వికెట్లు పడిపోయిన సమయంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

టీం సంక్షోభ సమయంలో రమణదీప్ ఫిల్ సాల్ట్‌తో కలిసి ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆపై 17 బంతుల్లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలో ఒక ఫోర్, 4 సిక్సర్‌లతో 35 పరుగులు చేశాడు. దీంతో రమణదీప్ పేరు చర్చనీయాంశంగా మారింది. రమణదీప్ తర్వాత, ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 64 పరుగులతో కేకేఆర్‌ను గెలిపించాడు.