మ్యాచ్ పోయినా.. కింగ్ కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు

30 March 2024

TV9 Telugu

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రదర్శన ఇంతవరకు అంత బాగా లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ ఇబ్బందులు పడుతోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు ఓడిపోయి ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 

శుక్రవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తరువాత, బెంగళూరు హోమ్ గ్రౌండ్‌లో RCBపై ఏ జట్లు ఆధిపత్యం చెలాయించాయో ఓసారి చూద్దాం..

IPL 2024 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఏకపక్షంగా విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లక్ష్యాన్ని కేకేఆర్ 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ విజయాన్ని అందుకుంది.

బెంగళూరులో రికార్డు స్థాయిలో 8వసారి RCBని KKR ఓడించింది. ఈ విధంగా, KKR టీం ఆర్‌సీబీ సొంత మైదానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. IPL చరిత్రలో RCBని ఇక్కడ ఎనిమిదోసారి ఓడించి రికార్డు నెలకొల్పింది. 

కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్ కూడా తమ సొంత మైదానంలో 8 సార్లు ఆర్‌సీబీని ఓడించిన ఘనత సాధించింది. కాగా, చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు చిన్నస్వామిపై తలొ 5 సార్లు ఆర్‌సీబీని ఓడించిన ఘనత సాధించాయి.

బెంగళూరులో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 4 సార్లు బెంగళూరును ఓడించాయి. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.